జనసేన పార్టీ చిల్లకూరు మండలస్థాయి సమావేశం..

గూడూరు: జనసేన పార్టీ కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మద్దతిచ్చే పార్టీలతోనే జనసేన పార్టీ పొత్తు ఉండేలా జనసేనాని నిర్ణయం తీసుకుంటారని.. జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం చిల్లకూరు మండలం పార్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుందని, యువకులు మరియు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. వివిధ పార్టీల మండల ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, జనసైనికులంతా అందరిని కలుపుకుపోతూ పని చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గడపకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేయాలని కోరారు. కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా జనసేన పార్టీ కౌలు రైతులకు చేస్తున్న సాయాన్ని ప్రజలకు తెలిసేలా పోస్టర్లు, స్టిక్కర్లు ద్వారా ప్రచారం చేయాలన్నారు. అనంతరం చిల్లకూరు మండల ఉపాధ్యక్షుడు జమాల్ భాషా మాట్లాడుతూ.. మండల కమిటీ నాయకులు ప్రజలకు అండగా ఉంటూ.. వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని, అలాగే పోలింగ్ బూత్ కమిటీలను ఏర్పాటు చేసి.. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు నిరంతరం పాటుపడాలని కోరారు. అనంతరం జనసేన పార్టీ వీర మాహిళలను సత్కరించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు సాయి స్వరూప్ చిల్లకూరు పార్టీ మండల కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు వెంకటేశ్వర్లు, వంశీ, దేవసేన, మనోజ్ కుమార్, మహేష్, వెంకయ్య, కార్తీక్ హరీష్, పరశురాం, మహేష్, ప్రభాకర్, సుమన్,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.