ఘనంగా బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినోత్సవ వేడుకలు

తాడేపల్లిగూడెం: గురువారం నాడు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు శుభ సందర్భంగా జనసేన పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో స్థానిక తాడేపల్లిగూడెం సవిత్రుపేట శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు పాలాభిషేకం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ముగించుకొని అనంతరం అక్కడ భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి అక్కడ భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ మా నాన్నగారి జన్మదిన వారోత్సవాల్లో నేను పాలుపంచుకోవడంలో ఎంతో ఆనందం గా ఉందని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమలను ముందుండి ప్రోత్సహిస్తున్న జనసేన నాయకులు వర్తనపల్లి కాశి, కేశవబట్ల విజయ్, మట్ట రామకృష్ణ, లింగం శ్రీను, రౌతు సోమరాజు, అత్తిలి బాబి, బయనపాలేపు ముఖేష్, కాజులూరి మల్లేశ్వరరావు లను అభినందించారు. ఈవారం రోజులు జరిగే నాన్నగారి పుట్టినరోజు వేడుకలు మరియు సేవ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో జనసేన నాయకులు అందరూ పాలుపంచుకొని ప్రజలకు సేవ చేయడం చాలా అభినందించాల్సిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాంశెట్టి సురేష్, మాదాసు ఇందు, యువర్న సోమశంకర్, బాదం ప్రకాష్, తుమరాద చిన్ని కందుల విజయ, కల్యాణి, మధు శ్రీ, ప్రశాంతి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.