మామిడి కుదురు మండల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం

మామిడి కుదురు మండలంలో మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజు ఆధ్వర్యం లో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను మండల జనసేన తీవ్రంగా ఖండించింది. అలాగే త్వరలో ప్రారంభించబోతున్న మండల కార్యాలయం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజు, నాయకులు కంకిపాటి నరసింహారావు, ఉపసర్పంచ్ తుండూరు బుజ్జి, గ్రామ అధ్యక్షులు ఇంటి మహీంద్ర, బల్ల సతీష్, జడ్డు చినరాజు, మండల కమిటీ సభ్యులు మండ గాంధీ, రాంబాబు,తల ఉమ, మద్దెల రాంప్రసాద్, కటకంశెట్టి రామకృష్ణ, గుల్లింకి గంగాధర్, అరవపాటి ఫణింద్ర, నేదూరి రామ రావు, కొమ్ముల రాము, కొమ్ముల శివ సాయి, మద్దెల మహేష్ మరియు జనసైనికులు పాల్గోన్నారు.