జనసేన పార్టీ వీరమహిళ ప్రశ్నల పర్వంతో దద్దరిల్లిన మండల ప్రజా పరిషత్ సమావేశ సభ

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండల(రామరాజులంక గ్రామం నుండి) జనసేన పార్టీ తొలి మహిళా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము మొదటిసారి జనగళం వినిపించారు ఓట్శ్ విధానం సరైనది కాదని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల పాలిట వరం కావాలి కానీ శాపంగా మారకూడదని. ఆమె అన్నారు రాజోలు నియోజకవర్గ ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు (మైక్ కట్ చేయడం) మా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సబబు కాదని మండలి చైర్మన్ నీ నిలదీశారు, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కుంటుపడిందని ప్రభుత్వ చేసే కార్యక్రమాల వలన పేద ప్రజల పై బారం పడి ప్రజల నడ్డి విరుస్తుంది అని ఆమె సభలో నిలదీశారు. సభా పరిచయ కార్యక్రమంలో నేను జనసేన పార్టీకి చెందిన వీర మహిళని అని ఆమెను ఆమె పరిచయం చేసుకున్నారు.