జనసేన పార్టీ ముస్లిం వర్గాల ప్రయోజనాలని కాపాడుతుంది: ముత్తా శశిధర్

కాకినాడ సిటీ, రామకృష్ణారావుపేట జెండా సెంటర్లో ఎండి.మెయినుద్దీన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో గురువారం ముస్లిమ్ సచార్ యాత్ర నిర్వహించడం జరిగినది. ఈ యాత్రలో పాలొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ గత ఆరురోజులుగా కాకినాడ సిటిలో ఎండి.మెయినుద్దీన్ ఆధ్వర్యంలో సచార్ యాత్ర చేస్తున్నారు, ఇదేమిటంటే ముస్లింల కోసం సచార్ అనే ఒక కమిటీ ఏర్పడి కొన్ని సూచనలతో ఒక రిపోర్టుని సమర్పించిందనీ వాటికి చట్టబద్ధత కల్పించి అమలు చేయాలంటూ 2019లో పవన్ కళ్యాణ్ తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారనీ, మన రాష్ట్రంలో రెండుచోట్ల ముస్లింలను స్వయంగా కలిసారనీ అందులో ఒకటి మన కాకినాడ అని గుర్తుచేసారు. కాకినాడలోని ముస్లింలను ఒక పార్టీ తమ సొంతం అనుకుంటోందనీ అది తప్పనీ, కారణమేంటంటే గత 15 సంవత్సరాలుగా ముస్లింలు ఏమి ఆస్థి సంపాదించుకున్నారని ప్రశ్నించారు. సొంతంగా ఇళ్ళు కట్టుకోగలిగారా, పొనీ వాళ్ళ మతపరమైన ఆస్థులు ఏవైనా పెరిగాయా అని ప్రశ్నిస్తూ 2009 తరువాత ఎలాంటిదీ లేదని, ముస్లింలకి ఆఖరుసారి రెవిన్యూకాలనీలో మసీదు కట్టింది తన తండ్రి హయాములో అని గుర్తుచేసారు. అప్పుడే కొత్త బరియల్ గ్రౌండ్ మంజూరు జరిగాయన్నారు. ఆ తరువాత ఉన్న మసీదులపై మేడ వెసుకోవడమో లేక జనరేటరో, ఏసి పెట్టుకోవడమో తప్ప ఇంకేమీ జరగలేదన్నారు. గత పదిహేను సంవత్సరాలలో చూసుకుంటే పోలీసు లైనులో ఒక మసీదు తప్ప ఇంకేమీ రాలేదన్నారు. 28 వేల ఇళ్ళు ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం అందులో ఎంతమంది ముస్లింలకు ఇళ్ళు ఇచ్చారో బహిర్గతం చేయాలన్నారు. ఇంతమంది ముస్లింలతో గృహప్రవేశం చేసామని చుపించండి మీతో వస్తాము అపుడు మీరు చేసారని ఒప్పుకుంటా అని అన్నారు. జనసేన పార్టీ ముస్లిం వర్గాల ప్రయోజనాలని కాపాడతారని హామీ ఇస్తూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ-తెలుగుదేశంల ఉమ్మడి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై పోరాటాలు ఇంకా తీవ్రం చేస్తామనీ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సమీర్, కాశ్మీర్ ఖాన్, ఎస్ కే భాష, రోషన్, అజారుద్దీన్, రెహమాన్, స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, శివాజీ యాదవ్, ఆకుల శ్రీనివాస్, మనోహర్ గుప్తా, సుంకర సురేష్, దొరబాబు, సతీష్ కుమార్, మండపాక దుర్గాప్రసాద్, దారం సతీష్, మావులూరి సురేష్, చీకట్ల వాసు, అగ్రహారం సతీష్, దారపు శిరీష, మిరియాల హైమావతి, సత్యవతి, బట్టు లీల తదితరులు పాల్గొన్నారు.