జనసేన నిరసన

తిరుపతి, గరుడ వారధి ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి మున్సిపల్ కార్యాలయం ముందు జనసేన నాయకులు ధర్నాకి దిగారు. వారధిని‌ ప్రభుత్వం వెంటనే ప్రారంభించి స్థానిక ప్రజలకు, యాత్రికులకు అందుబాటులోకి తీసుకుని రావడంలో నిర్లక్ష్యం వహిస్తుందని జనసేన నాయకులు సిటీ ప్రెసిడెంట్ రాజారెడ్డి, మరియు రాజేష్ యాదవ్, బాబ్జి, సుమన్ బాబు, రాజేష్, అమృత, కీర్తన, అరుణ, కోకిల, మునస్వామి, రమేష్, బలరామ్, సాయి దేవ్, సుమన్, హేమంత్, రాజేంద్ర, బాలాజీ, మని, గోపి లతో కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గరుడ వారధిని‌ ప్రారంబించక పోతే తమిళనాడు తరహాలో ప్రజలే ప్రారంభిస్తారని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.