విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనసేన నిరసన

తణుకు, విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కలుగజేయడమే గాక జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసినందుకు నిరసనగా సోమవారం తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి మున్సిపల్ ఆఫీసు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.