స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ప్రేమ చంద్

పాలకొండ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో ఉన్నటువంటి అన్నవరం గ్రామం పరిధిలో గల ఉండే ఆలయం శ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయంలో గురువారం అయ్యప్ప స్వామిలకు, శివ స్వామిలకు, భవాని స్వామిలకు సుమారు 100 మందికి పైగా ఉన్నటువంటి భక్తులకు పాలకొండ పట్టణంకి చెందిన శ్రీ విజయ ఆసుపత్రి ప్రముఖ గైనకాలజిస్ట్ విజయలక్ష్మి అనూష జనరల్ వైద్యనిపుణులు ప్రేమ చంద్ అన్నదానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏముకుల వైద్య నిపుణులు ఎస్ రాజేష్ జనరల్ సర్జన్ సాయి కృష్ణ పిదియాటిక్ వీణా సరస్వతి ఇంటెన్సివ్ కేర్ వైద్యులు డి విక్రమ్, డెంటల్ వైద్యులు రామ్ నాయక్, డ్యూటీ డాక్టర్ అభినయ్ లు పాల్గొన్నారు. కార్తీక మాసం అత్యంత భక్తిశ్రద్ధలతో దీక్షను చేపట్టిన స్వాములకు ప్రసాదం అందజేయడం సంతృప్తికరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమం గురుంచి జానీ మాట్లాడుతూ ఇంతటి మహోన్నత కార్యక్రమం చేసిన అనూష మేడం గారికి ప్రేమ్ చంద్ గారికి దైవ ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలి అని మనసారా కోరుకుంటున్నానని, ఇలాంటి గొప్ప వ్యక్తులను ప్రత్యేకంగా కలవడం సంతోషంగా ఉంది అని స్వామిలు అందరి ఆశీస్సులు విజయశ్రీ హాస్పిటల్ పైన వారి సిబ్బంది పైన ఉండాలని కోరుకున్నారు.