నిరాహార దీక్ష చేస్తున్న పిఈటి లకు జనసేన సంఘీభావం

పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం మండలం ఐటీడీఏ పరిధిలో గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పిఈటి లకు జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలపడం జరిగింది. వారు 2016లో సుమారు 120 మందిని ఉద్యోగానికి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ గత సంవత్సరం నుండి 10 మంది ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది. కారణం అడిగితే అధికారులు ఎటువంటి స్పందన లేదు వారు 17 రోజుల నుంచి దీక్ష చేస్తున్న ఎవరు కూడా పట్టించుకోవడం లేదు వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తీసుకోలేని ఎడల జనసేన పార్టీ తరఫున ఐటిడిఎ ని ముట్టడి చేస్తామని ఉద్యోగస్తులకు మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ చిర్రిబాలరాజు పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కార్యధర్శి పాదం నాగకృష్ణ బుట్టాయిగూడెం మండల అధ్యక్షులు తెల్లం రవి ప్రసాద్ పైదా పోతురాజు సరియం ముత్యాలరావు తెల్లం పున్నయ్య, కుంజా వెంకన్నబాబు, ఇరపా దుర్గాప్రసాద్‌ పూనెం రాజాపదిలం సాయి, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.