మృతుని కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది: బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం జనసైనికులకు ఎటువంటి ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల పత్తిపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగిన శ్యామ్ శేఖర్ సూర్యనారాయణ కుటుంబాన్ని బుధవారం బొలిశెట్టి పరామర్శించారు. ఆ కుటుంబానికి బొలిశెట్టి, జనసైనికులు కలిపి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా కలవచ్చిని మృతుని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు లింగం శ్రీను, పాలూరి భూరయ్య, పాలూరి బంగర్రాజు, ఆకుల రామకృష్ణ, పాలూరి సందీప్, తమ్మిశెట్టి సురేష్, గుర్రాల శివ, భొరుసుప్రభు, జిల్లా చిన్న, ఎర్రంశెట్టి ప్రసాద్ తదితరులు ఉన్నారు.