బాధాతప్త హృదయులకు జనసేన అండగా ఉంటుంది: డాక్టర్ యుగంధర్ పొన్న

  • ఓటు బ్యాంకు రాజకీయం కన్నా ఔధార్యం మిన్న
  • పవన్ కళ్యాణ్ కి పవర్ ఇవ్వండి ప్రజా పాలన అందిస్తాం
  • వర్షంలో దెబ్బతిన్న గోపాలయ్య కుటుంబ పరామర్శ
  • బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి
  • కుటుంబానికి భరోసా ఇచ్చిన జనసేన ఇంచార్జి డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, తిరుమలయ్య పల్లి గ్రామపంచాయతీ, మొరవలో ఆదివారం కురిసిన వర్షానికి గోపాలయ్య ఇంటి రేకులు పడిపోయి ఇబ్బంది పడ్డ కుటుంబాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ డాక్టర్ యుగంధర్ పొన్న వారికి నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయం కన్నా ఔధార్యం మిన్నా అని, సహాయం చేయడంలో అన్ని పార్టీల కంటే ముందుంటుందని తెలిపారు. బాధాతప్త హృదయులకు జనసేన అండగా ఉంటుందని, ఎక్కడ కష్టాలు ఉంటుందో, ఎక్కడ అర్ధనాథాలు వినిపిస్తుందో, ఎక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటారో అక్కడ జనసేన అండగా ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కి పవర్ ఇవ్వండి, ప్రజా పాలన అందిస్తామని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో సిద్ధాంతాలకు కట్టుబడి, పూర్వీకులు అడుగుజాడల్లో నడుస్తూ, మానవీతా కోణంలో అడుగులు వేస్తూ, మానవతామూర్తులను గుర్తుకు తెచ్చుకుంటూ తనదైన శైలిలో సేవా దృక్పథంతో కూడిన రాజకీయాలు చేస్తున్నది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా ఈ నియోజకవర్గ సస్యశ్యామల అవ్వాలంటే, అన్ని గ్రామాల్లో సర్వతో ముఖాభివృద్ధి జరగాలంటే, జనసేన ను ఆదరించాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక్క అవకాశం ద్వారా పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఏ నియోజక వర్గంలోని 255 బూత్ లలో 255 గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం కురిసిన దెబ్బతిన్న గురవయ్య కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో వెదురు కుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు గోపతి శెట్టి, సతీష్, యతీశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శిలు కోలార్ వెంకటేష్, రాఘవ, మండల కార్యదర్శి దినకర్, అజయ్ జనసైనికులు పాల్గొన్నారు.