సమస్యల మీద జనసేన పోరాటం

మాడుగుల నియోజకవర్గం, ఎం కృష్ణాపురం పంచాయతీలో ఉన్న గ్రానైట్ క్వారీ నుంచి అధిక సంఖ్యలో లారీలు రావడం వల్ల గ్రామానికి వెళ్లే రోడ్లు చాలా పాడైపోయాయి. జనసేన పార్టీ తరఫున మాడుగుల మండల జనసైనికులు అందరూ కలిసి క్వారీ ఇన్చార్జి అయిన రామకృష్ణతో కూర్చుని దీనికోసం చర్చించి రోడ్లు వేయమని కోరడం జరిగింది. వర్షాకాలం వల్ల వేసిన రోడ్లు పాడువౌతున్నాయని శాశ్వత పరిష్కారంగా వేసవికాలంలో తారు రోడ్డు క్వారీ తరపున వేయిస్తామని అంతలోపు చిన్న చిన్న మరమ్మత్తుల్ని సిమెంట్ బుగ్గు మరియు కంకర వేసి సరి చేస్తామని రైతులకు గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేం చూసుకుంటామని ఆయన జవాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం కృష్ణాపురం ప్రజలు, మాడుగుల మండల జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.