Pedana: గ్రామానికి జనరేటర్ బహూకరించిన జనసేన ఉపసర్పంచ్

కరెంటు కోతల నేపధ్యంలో రక్షిత మంచినీటి పథకానికి విరామం

పెడన నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతున్న అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండల పరిధిలో ఈ కోతలు మరీ ఎక్కువగా ఉన్నాయి. కరెంటు ఎప్పుడు ఉంటుందో… ఎప్పుడు పోతుందో… తెలియని పరిస్థితుల్లో గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేసవి వస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని భావించారు నీలిపూడి గ్రామ ఉప సర్పంచ్, జనసేన నాయకుడు శ్రీ పుప్పాల పాండురంగారావు. కరెంటు కోతల వల్ల తమ గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అదీ సొంత ఖర్చులతో.. కరెంటు లేకపోయినా రక్షిత మంచినీటి పథకం నడిపించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడున్నర లక్షల రూపాయిలు వెచ్చించి 15కెవి జనరేటర్ కొనుగోలు చేసి పంచాయితీకి బహూకరించారు. నవంబర్ 17వ తేదీన ఈ జనరేటర్ ను పంచాయితీ బోర్డు సభ్యులు, నీలిపూడి గ్రామ ప్రజల సమక్షంలో ప్రారంభించారు. కార్యక్రమంలో నీలిపూడి సర్పంచ్ శ్రీ పాశం కృష్ణ, జనసేన పార్టీ నాయకులు శ్రీ ఎస్.వి. బాబు, శ్రీ పాశం నాగమల్లేశ్వరరావు, శ్రీ పుప్పాల సుబ్బరావు, శ్రీ పుప్పాల సూర్యనారయణ, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.