మండల వి.ఆర్.ఏ ల దీక్షకు జనసేన మద్దతు-టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

టెక్కలి, మండల వి.ఆర్.ఏ ల సమస్య ల పరిష్కరనీకై మండల కేంద్రాలలో రిలే దీక్షలు చేస్తున్న టెక్కలి మండల వి.ఆర్.ఏ లను నేడు దీక్ష శిబిరంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ కలసి వారికి జనసేన పార్టీ తరుపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వి.ఆర్.ఏ లు తన దృష్టికి తీసుకు వచ్చిన వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించి గత ఏప్రిల్ నెలలో వారినుండి రికవరీ చేసుకున్న వారి నెల జీతాన్ని తక్షణమే వారి అకౌంట్స్ లో వేయాలని, అర్హులైన వారికి వెంటనే ప్రమోషన్ లు ఇవ్వాలని, వారికి అన్ని ప్రభుత్వ పథకాలను అందివ్వాలని కణితి కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.