మహాపాదయాత్రకు మద్దతు తెలిపిన జనసేన

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో భాగంపల్లి గ్రామపంచాయతీ కుప్పగుట్టపల్లిలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై ఎమ్మార్పిఎస్ మహాదేవ, ఎం.ఎస్.పి నాగరాజ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రకు రాజంపేట జనసేన నాయకులు రామ శ్రీనివాస్ జనసేన తరపున మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రామ శ్రీనివాస్, అంబేడ్కరీస్ట్ ఫలం నాగేంద్ర జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పార్టీల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్ లో పలువురు రాజకీయ నేతలు, రామంజులు, విశ్వనాథన్ నాయక్, మనోహర్, యువకులు, గ్రామస్థులు, ప్రజలు పాల్గొన్నారు.