సీతానగరంలో టిడిపి రిలే నిరాహార దీక్షలకు జనసేన మద్దతు

సీతానగరం: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ సీతానగరం మండల కేంద్రంలో చేపట్టిన ధర్నాకు తెలుగుదేశం పార్టీ వారి ఆహ్వానం మేరకు పార్వతీపురం నియోజకవర్గం జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ పైల సత్యనారాయణ మరియు సీతానగరం మండల పార్టీ అధ్యక్షుడు పార్టీ శ్రీనివాసరావు మరియు జిల్లా కార్యనిర్వాహ కమిటీ కార్యదర్శి అల్లు రమేష్ మరియు మండల నాయకులు చిప్పాడ సూర్యనారాయణ, శంకర్ రావు, వెంకటరమణ, హాయ్ కిరణ్, అచ్యుత నాయుడు, ప్రకాష్, గణేష్, కృష్ణ, నారాయణరావు మరియు పార్వతీపురం పట్టణ నాయకులు చెందక అనీల్, చంటి, రాజాన రాంబాబు, గౌరీ శంకర్ మరియు జనసేన శ్రేణులు పాల్గొన్నారు. నాయకులు పైల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిపక్షనేత అయిన చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనేది ముమ్మాటికి కక్ష సాధింపుగానే చూస్తాము తప్ప ఇంకో మాదిరిగా చూడలేమని కంఠాపదంగా చెప్పడం జరిగింది. ఈ వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని జనసేన మరియు తెలుగుదేశం సమిష్టిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరిగే వరకూ మా మద్దతు ఉంటుందని జనసేన పార్టీ పక్షాన తెలియజేయడమైనది. ఫాసిజం సిద్ధాంతాలను అలవర్చుకున్నా మరియు అవలంబిస్తున్న ముఖ్యమంత్రి జగన్ తొందరలో ప్రజా తీర్పుతో ప్రజా కోర్టులో బోల్తాపడడం ఖాయమని బెయిల్ పై ఉన్న వ్యక్తి మళ్లీ అదే చెంచలకోట జైలుకు వెళ్లడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి అధికారమై తేలుతూ ఉంటే చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవినీతిపరుడే అని గాంధీ గారి మాటలను నిరసన సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమయం ఆసన్నమైందని జనసేన మరియు తెలుగుదేశం సైన్యం ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా గెలుపే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడి ఉమ్మడి భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని నెలకొల్పాలని హితువు పలికారు. చివరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మరియు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలని నిరసనగలం వినిపించి ముగించారు.