జనసేన – టీడీపీ ఉమ్మడి కార్యాచరణ సమన్వయ కార్యక్రమం

సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ కాలనీలో మాజీ మంత్రి కన్నా క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం,జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణ సమావేశంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో భవిష్యత్తు కార్యాచరణ, ఏ విధంగా ఉండాలి అనే కార్యక్రమం మీద చర్చ జరిగింది. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, నిరంకుశ పరిపాలనను తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు సంయుక్తంగా క్రింది స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ పరిపాలన గురించి కిందిస్థాయిలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు సమన్వయంగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుండి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమిశెట్టి సాంబశివరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, సత్తెనపల్లి పట్టణ ఏడవ వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, నాదెండ్ల నాగేశ్వరావు సత్తెనపల్లి మండల అధ్యక్షులు, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నర్సయ్య, నకరికల్లు మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మి, సిరిగిరి రామారావు దమ్మాలపాడు ఎంపీటీసీ, ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు అలాగే టిడిపి నుండి యెల్లినేడి రామస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్, నాగోతు సౌరయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు, చౌట శ్రీను రాష్ట్ర కార్యదర్శి, కనుమూరి బాజిచౌదరి రాష్ట్ర కార్యదర్శి, భీమినేని వందనా దేవి జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి మరియు ఇతర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.