ఘనంగా జనసేన తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు గాదె పృథ్వి నేతృత్వంలో స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగ నాయకులు స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హల్ నందు కేకు కట్ చేసి, చౌరస్తాలో వృద్దులకు పండ్లు పంపిణీ చేసారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ కార్యకర్తగా మొదలై నేడు పార్టీ ఇంచార్జ్ స్థాయి వరకు ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజారాజ్యం నుండి అధినేత వెంట ఉంటూ వారి సన్నిహితులుగా ఉన్నారని తెలిపారు. బోరబండ బస్తీలో పుట్టిన శంకర్ గౌడ్ అనతికాలంలో మాస్ లీడర్ గా ఎదిగారన్నారు. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి యువతతో కలిసి పోరాడుతున్నారని గుర్తుచేసారు. రాబోయే రోజుల్లో మరింత స్థాయికి ఎదగాలని ఆకాంశిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండీ రజాక్, మునిగేలా పవన్, చుక్క నవీన్, మహేష్, బషీర్, సోహెల్, రాజు, విజయ్, రాము, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.