కొల్లాయివలస గ్రామంలో గడపగడపకు జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం: గడపగడపకు జనసేన కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగ మండలంలోని, కొల్లాయివలస గ్రామంలో శ్రీమతిలోకం మాధవి పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా గడపగడపకి తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ, వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకి తమ ఓటు వేసి జనసేన పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు. ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్న మాధవి ముఖ్యంగా నీటి సమస్యతో గ్రామస్తులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమకి అధికారం కట్టబెడితే, ప్రతి ఇంటికి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తాను మాట ఇచ్చి మోసం చేసే నాయకురాలను కాదు అని, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతానని తెలిపారు. అలాగే అర్హులైన వారికి ప్రభుత్వం నుండి సహాయం అందడం లేదని తెలుసుకున్న మాధవి, ఆ బాధితులతో కలసి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేసి న్యాయం జరిగేలా చూస్తానని తెలియజేశారు.