ఉరవకొండలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఉరవకొండ నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శనివారం ఉరవకొండ జనసేన కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా జనసేన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ తమ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలోని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా బెలుగుప్ప మండలంలో సుధీర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు కేశవ ఆధ్వర్యంలో హాస్పిటల్ నందు బ్రెడ్ పళ్ళు పంపిణీ, స్కూల్ పిల్లలకు పుస్తకాలు స్వీట్లు పంపిణీ పలుపలు మండలాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రాజేష్, నియోజకవర్గం నాయకులు దేవేంద్ర, రమేష్, భోగేష్, నీలకంఠ, రూపేష్, మణికుమార్, భార్గవ్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.