మలిదశ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్న జనసేనాని

క్రియాశీలక సభ్యత్వ నమోదును మలిదశను ప్రారంభించమని పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గతంలో నమోదు చేసిన సభ్యత్వం భీమా కోసం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల నిధులు అందించిన విషయం మీకు విదితమే. ఈ భీమా గడువు గత డిసెంబర్ మాసాంతానికి ముగిసింది. అదే విధంగా వచ్చే మార్చి31 వరకు క్రియాశీలక సభ్యులకు భీమాను పొడిగించమని కోరిన పవన్ కళ్యాణ్ ఈ మూడు నెలల కాలానికి భీమ ప్రీమియానికి అవసరమైన మొత్తాన్ని స్వయంగా చెల్లించారు. ఏప్రిల్ 1 నుంచి నూతనంగా భీమాను అమలు చేయవలసి ఉంది. అందువల్ల ఫిబ్రవరి 21వ తేదీన క్రియాశీలక సభ్యుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించమని అధ్యక్షుల వారు ఆదేశించారు. ఈ కార్యక్రమం కోసం 50 మంది సభ్యులతో ఒక విభాగం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైంది. ఈ కార్యక్రమాన్ని మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుకు తీసుకువెళ్ళడానికి కనీసం 20 మంది వాలంటీర్ల పేర్లను, వారి మొబైల్ నెంబర్లను ఈ నెల 16వ తేదీనాటికల్లా పార్టీ కార్యాలయంలోని 6304900667 నెంబర్ వాట్సాప్ కు పంపగలరు. వాలంటీర్లు అందరికీ ఒక డెమో వీడియో, సభ్యత్వ నమోదు యాప్ కేంద్ర కార్యాలయం నుంచి పంపుతాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కేంద్ర కార్యాలయం లేదా అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ని సంప్రదించవలసిందిగా కోరుచున్నామని జనసేన పార్టి కేంద్ర కార్యాలయం తెలిపింది.