జగిత్యాలలో జనంలోకి జనసేన

జగిత్యాల నియోజకవర్గం: రాయికల్ మండలంలో బుధవారం జగిత్యాల నియోజకవర్గ జనసేన ఇంఛార్జి బెక్కం జనార్ధన్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన సిద్ధాంతాలను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను జగిత్యాల నియోజకవర్గ జనసేన ఇంఛార్జి బెక్కం జనార్ధన్ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ రేపటి యువత భవిష్యత్తు కోసం నిజాయితీగా ప్రజా సమస్యల మీద నిస్వార్థంతో ప్రజలకు అందుబాటులో వుంటాము అని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న గారి ఆశయం కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విద్య వైద్యం ఉపాధి ప్రజల చెంతకు చేరేవరకు పోరాటం చేస్తాము అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు కాస రాజు, పడాల ప్రసాద్ గౌడ్, సంగణభట్ల వినయ్, వడ్డేటి కరుణాకర్, గంగం అజయ్ కుమార్, చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ హాజీ, కంచర్ల భాస్కర్, జగిత్యాల డివిజన్ నాయకులు చింత సుధీర్, శ్రీకర్, ఎదురుగట్ల ప్రభాకర్, బాలే నరేష్, అజయ్, విష్ణు, రాయికల్ మండల అధ్యక్షులు కాసవిని మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి బత్తిని బాబు, వైస్ ప్రెసిడెంట్ పొన్నం రాకేష్, వీరమహిళలు ధన, స్వప్న, పద్మ తదిరులు పాల్గొన్నారు.