వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్చే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డి: చిల్లపల్లి శ్రీనివాసరావు

  • ప్రభుత్వానికి సమాంతరంగా వాలంటరీ వ్యవస్థని నడుపుతున్నారు.
  • సీఎం ఇంటి వద్ద వాలంటీర్ రోడ్డున పడితే అప్పుడు ఏమైపోయావ్ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి

మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లడుతూ

★ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి మాట్లాడారని వాలంటీర్లు మాకు పవిత్రమని కాళ్లు కడిగి నీళ్ళు చల్లుకున్నారు. ఈ ఒక్కటే చేయటం కాదు, మీ వల్ల మోసపోయిన రాజధాని రైతులు, ఇప్పటం, ఆత్మకూరులో ఇల్లు కోల్పోయి రోడ్డును పడ్డ బాధితులు, ఉద్యోగాలు లేక భవిష్యత్తు కోల్పోయిన యువతకి కాళ్లు కడగాలి.

★ సీఎం ఇంటి వద్ద వాలంటీర్ ఉద్యోగి ఇల్లు కోల్పోయినప్పుడు, కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆర్కే.

★ అలాగే ఈరోజున వైసీపీ గవర్నమెంట్ వాళ్లు ప్రభుత్వ అధికారులు చేయాల్సిన విధులను వాలంటరీల చేతికిచ్చి వాళ్ల చేత చేయిస్తున్నారు.

★ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, పోలీస్ డిపార్ట్మెంట్, అడ్మిటేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంటు వాళ్లు చేసే విధులను మీరు వాలంటరీలకి అప్పజెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు ఏమో అధిక మొత్తంలో జీతాలు ఇచ్చి, వాలంటరీలకు 5 వేలు ఇచ్చే వాళ్ల చేత పనిచేస్తున్నారు.

★ వైసిపి ప్రభుత్వం వారు వాలంటీర్ల చేత చేయించేది రాజకీయ లబ్ధి కోసమే వాలంటరీ వ్యవస్థాపన చేస్తుంది. జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం అని అన్నారు.

★ వాలంటరీలు ఉంటే మాకు ఎంత గౌరవం. వాలంటరీలు వ్యక్తిగత పర్సనల్ డేటాని సేకరించడం తప్పని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటరీలు వ్యక్తిగత పర్సనల్ డేటాని కలెక్ట్ చేయటానికి జనసేన పార్టీ వ్యతిరేకం.

★ వైసిపి మంత్రులే మీడియా సమావేశాల్లో వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలే అని స్టేట్మెంట్ ఇచ్చారు.

★ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వాలంటరీ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుస్తాం.

★ వైసీపీ ప్రభుత్వానికి సత్తా ఉంటే వాలంటరీ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్చండి. మంగళగిరి నుంచి సవాలు విసురుతున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా కార్యదర్శి రావిరామా, ఎం.ఎం.టి.సి అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), జనసేన నాయకులు, కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు తిరుమలశెట్టి కొండలరావు,మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎం.ఎం.టి.సి ఉపాధ్యక్షులు షేక్ కైరుల్లా, ఎం.ఎం.టి.సి ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు, ఎం.ఎం.టి.సి కార్యదర్శులు బళ్ళ ఉమామహేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, బేతపూడి జనసేన నాయకులు వాసా శివన్నారాయణ, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ జోన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ సభ్యులు దీపక్, నాగరాజు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.