పొందుగుల గ్రామంలో జనసేన గ్రామ స్థాయి సమావేశం

పొందుగల: జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పొందుగుల గ్రామంలో రైస్ మిల్ వద్ద జనసేన పార్టీ పొందుగల గ్రామ కమిటీని ఏర్పాటు చేయుట కొరకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ, జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, మండల కమిటీ నాయకులు మరియు పొందుగల గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.