పేద వ్యక్తి అంబటి స్వామికి బిల్లింగ్ స్లాపుకు సహకారం అందించిన జనసేన

అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, పైన గ్రామంలో దళిత వాడలో కొత్తపల్లి అంబటి స్వామి సుమారుగా 12 సంవత్సరాల నుంచి బిల్లింగ్ స్లాపు వేసే సోమత లేక ఎప్పటినుంచో ఇంటి ముందు బరకాలు, తాటాకులు కట్టుకొని ఎండకి వానకి అనేక ఇబ్బందులు పడుతూ నివసిస్తున్నాడు.. ప్రభుత్వాలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ ఆయనకు సహకారం అందించలేదు.. ఎంతో ఇబ్బందులు పడుతున్న ముసలి తాతను చూసి.. ఆ గ్రామ జన సైనికులు బద్రి, నవీన్, నాని గుర్తించి జనసేన నాయకులకు తెలియజేయగా.. దీనికి అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు వీరాస్వామి, రావాడ నాగు, ఉపాధ్యక్షుడు గోవిందు, మండల నాయకులు వెంకటరమణ, సుంకర బుజ్జి, వెంకటేష్, సీతారాం, అశోక్, కర్రి శ్రీను ఇంకా మరి కొంతమంది జనసైనికులు సహకారం అందించి స్లాపు వేసే కార్యక్రమం పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన తాపీ మేస్త్రులుగా చేస్తున్న పెదపూడి గ్రామ జనసేన నాయకులు రవి, సతీష్.. వారికి సహకారం అందిస్తున్న జనసైనికులు బద్రి, నవీన్, శ్రీను అనిల్ కుమార్, శ్యామ్ తదితరులు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.