చిన్నారికి ఆర్ధికసాయమందించిన జనసేన

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పట్టణం కల్వకొలను వీధిలో నివాసముంటున్న జక్కంపూడి ప్రసాద్ కుమార్తె జక్కంపూడి ప్రణవి పుట్టుకతోనే చెవిటి, మూగ వ్యాధితో బాధపడుతుండడంతో ఆ పాపకి వైద్యం నిమిత్తం జనుపల్లి, నల్లమిల్లి, జనసైనికులు రూపాయలు 5,000/- సమకూర్చగా జనసేన పార్టీ నాయకులు నల్లా శ్రీధర్, అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, డి.ఎస్.ఎన్ కుమార్ నల్లా వెంకటేశ్వరావు, అల్లాడ రవి, నిమ్మకాయల రాజేష్ కలిసి 12,000 మొత్తం 17,000 వేల రూపాయలు తండ్రి ప్రసాద్ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ.వేమవరప్పాడు ఉపసర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.