కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన ప్రజల పక్షాన పోరాడుతుంది

  • భైరపోగు సాంబశివుడు కొల్లాపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్

తెలంగాణ, కొల్లాపూర్ నియోజకవర్గం: కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న పెంట్లవెల్లి మండలంలో పెంట్లవెల్లి మండలాలు సంబంధించిన వివిధ గ్రామాల జనసైనికులు, నాయకులతో జనసేన పార్టీ పెంట్లవెల్లి మండలం భవిష్యత్తు రాజకీయాలపై జనసేన పార్టీ రాబోయే ఎన్నికలలో వెళ్లాల్సిన విధానం, భవిష్యత్తులో జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదిగే దిశగా తగు కార్యచరణ రూపొందించడం జరిగింది. మండల కమిటీని నియమించడం, మండలానికి సంబంధించిన ఎనిమిది గ్రామాలలో జనసేన పార్టీ గ్రామ కమిటీలు నియమించడం ఇలాంటి అనేక అంశాల మీద పార్టీ బలోపేతానికి కావాల్సిన, విధివిధానాలు ప్రజా సమస్యల పైన పరిష్కారమయ్యే స్థానిక సమస్యలకు మీద ప్రజలకు అనుగుణంగా వెళ్లాల్సిన విధానాలు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా జనసేన పార్టీ ముందుకెళ్లే విధంగా కార్యచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బైరపోగు సాంబశివుడు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదిగే పార్టీగా యువత పెద్ద ఎత్తున ఉండే పార్టీగా ప్రజల కోసమే పేద వర్గాల కోసమే బడుగు బలహీన వర్గాల కోసమే వారి సమస్యల ఎజెండాగా వారిని రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని నిర్మించారు. ఆ దిశగానే జనసేన పార్టీ కోసం నిత్యం మనం పాటుపడి మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరువ చేసే విధంగా మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానాన్ని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఆయన ఆలోచిస్తున్న విధానాన్ని రాజకీయంగా వాళ్లకు కల్పిస్తున్న అవకాశాలను ప్రజలకు చేరవేసి భవిష్యత్తులో డబ్బుతో ముడిపడిన రాజకీయం కాకుండా సిద్ధాంతంతో ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకులను స్వచ్ఛందంగా ముందుకొచ్చే నాయకులని జనసేన పార్టీ ముందుండి నడిపిస్తుందని, అ దిశగానే మనం ముందుకెళ్లాలని కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులని, పార్టీ యొక్క కార్యకర్తలని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్లను గొప్ప నాయకులుగా తీర్చిదిద్దే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్లాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు సాగించే దిశగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఈ సందర్భంగా పెంట్లవెల్లి మండలనీకి సంబంధించిన నాయకులకు సూచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంట్లవెల్లి మండల నాయకులు రవితేజ, ఎం.డి అక్బర్, రెడ్డి రమేష్, బాలు, తెలుగు చిన్న, ఎం.డి షాకిర్, శివ, రవి, వెంకటేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.