ఆదివాసి బిడ్డల పక్షాన జనసేన అండగా నిలిచి పోరాడుతుంది

పాడేరు, మన్యంలో ఆగని శిశు మరణాలు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం అని రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ అన్నారు. జి.మాడుగుల మండలం నూర్మతి పంచాయితి, వాకపల్లి గ్రామం, తల్లే లక్ష్మణ్ రావు సత్యవతి దంపతులకు పుట్టిన 5 నెలల పసి కందు, గురువారం మృతి చెందింది. గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు లేకపోవడం, కనీసం గ్రామాలలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై అరా తీసే నాదుడే కరువయ్యాడు, ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లలో వందల సంఖ్యలో పసిపిల్లలు మొదలుకొని, స్కూల్ విద్యార్థులు మొదలుకొని వందల సంఖ్యలో చనిపోయారు. అన్నో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపి, మరణాల పట్ల బాధ్యత వహించి, పూర్వాపరాలను పరిశీలించి, మరణాలు అరికట్టే ప్రయత్నాలు చేయకపోవడం విడ్డూరం. దీని బట్టి చూస్తే, ఆదివాసి బిడ్డల ప్రాణాలపై ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఎంత ప్రేమ, బాధ్యత ఉందో క్లుప్తంగా అర్థమౌతుంది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా వైసీపీ నాయకులు ఎందుకు నోరు మెదపలేదని, జనసేన పార్టీ తరపున ప్రశ్నిస్తున్నాము. మైనింగ్, లిక్కరు, భూదందాలు, సంపాదన మీద పెట్టిన మీ దృష్టి మా ఆదివాసి బిడ్డల ఆరోగ్యం మీద ఎందుకు పెట్టటం లేదు. మా ప్రాణాలకు రక్షణ ఇవ్వని మీరు రేపు ఓట్ల కోసం ఏ మొహం పెట్టుకొని మా గ్రామాల్లో వస్తారు. ముందు ఈ సమస్యల పరిష్కారం చేసి ఓట్లు అడగటానికి రండి. లేదంటే ఓట్లు అడిగే నైతిక హక్కు మీకులేదు, మీ ప్రాణం ఎంత విలువైనదో మీకు ఓటువేసి గెలిపించిన ప్రజల ప్రాణం అంతే విలువైనదనే సత్యాన్ని గ్రహించకపోవడం అంత మూర్ఖమని ఎద్దేవా చేశారు. కళ్ళముందు సాటి మనిషి ఆపదలో ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు, మాకెందుకని దుయ్యబట్టారు. వైద్య అధికారులు కానీ ఐటిడిఏ అధికారులు కానీ ఎవరికి సేవచేయటానికి వచ్చారు. కనీసం స్పందించరా..? అని డిమాండ్ చేశారు. ఆదివాసి గిరిజన బ్రతుకులతో చెలగాటమాడుతున్న మీకు శిక్ష తప్పదని, హెచ్చరించారు. ఆదివాసి బిడ్డల పక్షాన జనసేన అండగా నిలిచి పోరాడుతుందని, మీ నిరంకుశ పాలనను త్వరలోనే గిరిజన ప్రజలు ఎండగడతారని అన్నారు.