మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు జనసేన కృషి చేస్తుంది: తీగల చంద్రశేఖర్

మత్స్యకారులు సమస్యలను పరిష్కరించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. వాకాడు మండలం తూపిలి పాలెం గ్రామంలో ఆయన పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 50 మంది మత్స్యకారులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన వారికి చంద్రశేఖర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతి జిల్లా, వాకాడు మండలం తూపిలి పాలెం పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీ నాయకులు పర్యటించి స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మత్స్యకారులు ఏర్పాటుచేసిన సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సముద్ర ముఖద్వారాలు పూడిపోయి ఉండడంతో సుమారు 14 గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం నుండి పెద్ద పెద్ద పడవల్లో వచ్చి సముద్రంలో చేపల వేట చేస్తుండడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇక్కడ స్థానికులు తెలిపిన సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి పని చేస్తామని హామీ ఇచ్చారు. మా పార్టీ అధినేత మత్స్యకారులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని పోరాటం కూడా చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు మహేంద్ర, వెంకటేశ్వర్లు, జయరాం, లక్ష్మి మల్లీశ్వర్ రావు, కాపు నాయకులు మహేంద్ర, వెంకటేశ్వర్లు, జయరాం, వెంకటేశ్వర్లు, మోహన్, కోటి, చిట్టి, సుబ్రహ్మణ్యం, రాజేష్, నరేష్, సుకుమార్, నవీన్, హేమంత్, కిరణ్, మోహన్, కోటి, శంకర్ గ్రామస్తులు పాల్గొన్నారు.