పడాలఅమ్మిరాజును అభినందించిన జనసేనాని..

మండలంలోని బడుగువానిలంకకు చెందిన జన సైనికుడు పడాల అమ్మిరాజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి చేసిన కృషి గుర్తించి జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఆయన నుండి అమ్మిరాజుకు ప్రత్యేక ఆహ్వానం రావడంతో ఇటీవల విజయవాడ (మంగళగిరి) పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో పవన్‌ను పడాల కలిశారు. ఈ విషయం గురువారం ఆయన బడుగువానిలంకలో విలేకరులకు వివరిస్తూ గ్రామ ఎంపీటీసీ స్థానాన్ని జనసేన తరపున పడాల నాగలక్ష్మి గెలుచుకోవడంపై పవన్‌ ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సైనికులను పార్టీలోకి ఆహ్వానించి జనసేన పార్టీ విజయానికి మరింత కషి చేయాలని పవన్‌ సూచించినట్లు ఆయన తెలిపారు. జనసేనాని ప్రత్యేకంగా ఆహ్వానించడంతో మరింత ఉత్సాహం పెరిగిందని పడాల అమ్మిరాజు వివరించారు.