న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద జనసేనాని జన్మదిన వేడుకలు

  • ఖండాలు దాటిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
  • జనసేన కోదాడ నియోజకవర్గ అభ్యర్థి మేకల సతీష్ ఆధ్వర్యంలో అమెరికాలో పవన్ జన్మదిన వేడుకలు

నల్గొండ నియోజకవర్గం: సీనీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు న్యూయార్క్ నగరంలో టైం స్క్వేర్ దగ్గర కోదాడ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మేకల సతీష్ ఆధ్వర్యంలో పవన్ అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 150 ఫీట్ ల ఎత్తులో స్క్రీన్ లో పవన్ ఫొటోస్ ప్రదర్శించి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానన్నారు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కృషి చేస్తానన్నారు. కోదాడలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.