బ్రహ్మాస్త్రం నాగు ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

గాజువాక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మాస్త్రం నాగు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం జరిగింది. అందులో భాగంగా శుక్రవారం థెరిస్సా స్ఫూర్తి అనాధ ఆశ్రమానికి ముందుగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. జనసేన పార్టీ క్రియా శీలక సభ్యుడు అయిన ఎస్.వి.సత్యన్నారాయణ గాజువాకలో ఉన్న ఈ థెరిస్సా స్ఫూర్తి అనాధ ఆశ్రమానికి ఆర్థిక సహాయం చెయ్యమని బ్రహ్మాస్త్రం నాగు కోరడం జరిగింది. అందులో భాగంగానే మొట్ట మొదట సహాయంగా సేవా కార్యక్రమాలలో భాగంగా పంపించడం జరిగింది. తదనంతరం శుక్రవారం సాయంత్రం జనసేన అధినేత చిత్ర పటానికి పాలాభిషేకం జరిపి అన్నదాన కార్యక్రమంతో పాటూ మందుగుండు సామాగ్రిని కాల్చి అంబరాన్నంటే విధంగా సంబరాలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.