యువత భవిత కోసమే జనసేన పోరాటం

  • యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
  • జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శృంగవరపుకోట నియోజకవర్గ పరిశీలకులు చిలకం మధుసూదనరెడ్డి.

శృంగవరపుకోట ఉత్తరాంధ్రలోని యువత భవిత కోసమే జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో మన యువత – మన భవిత ‘యువశక్తి’ కార్యక్రమం తలపెట్టారని, ఈ కార్యక్రమంలో వేలాదిమంది యువకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శృంగవరపుకోట నియోజకవర్గ పరిశీలకులు చిలకం మధుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, పారిశ్రామిక వృద్ధి లేక కుటుంబాల వలసలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై జనసేన యువశక్తి పేరుతో పోరాటం మొదలు పెట్టిందని, ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో పర్యటన చేయకుండా పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదులో చంద్రబాబును పరామర్శ చేస్తే ఈ ప్రభుత్వానికి, మంత్రులకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాదరణ మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ ని చూస్తే ప్రభుత్వం జడుసుకుంటోందని దుయ్యబట్టారు. ప్రభుత్వంలోని కాపు మంత్రులతో పవన్ కళ్యాణ్ ను తిట్టించడాన్ని ఖండించారు. పవన్ కళ్యాణ్ పై నోరుపారేసుకోవటాన్ని మానుకోక పోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మంత్రి గుడివాడ అమర్ నాధ్ పారిశ్రామిక అభివృద్ధికి, ఉత్తరాంధ్ర వెనుకబాటుని రూపుమాపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తు పవన్ కళ్యాణ్ ని విమర్శించడాన్ని తప్పుబట్టారు. రానున్న ఎన్నికల్లో జనసేన అత్యధిక సీట్ల ను కైవసం చేసుకుంటుందని, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పారు. యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు మరింతగా కష్టపడాలని హితవు చెప్పారు. పార్టీ జిల్లా నాయుకుడు వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ. నియోజకవర్గంలో జనసేన పార్టీీ బలంగా ఉందని, అత్యధిక సంఖ్యలో హాజరయ్యే యువకులు, ప్రజలు కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, పెడిరెడ్ల రాజశేఖర్, జనసేన ఎస్.కోట మండల పార్టీ అధ్యక్షుడు కొట్యాడ రామకోటి, కొత్తవలస మండల అధ్యక్షుడు ఎన్.సతీష్, వేపాడ మండల అధ్యక్షుడు సుంకరి అప్పారావు, ఎల్.కోట నుండి ఫిరాజ్, జామి వర్మరాజు, రుద్ర నాయుడు నాయకులు మోపాడ చిన్ని, పి.చంటి, సతీషు, శివాజీ, మల్లు వలస శ్రీను, శ్రీను రామదాసు కాళీ, అలమండ రాంబాబు, చిన్ని, పిల్లల రామదుర్గ తదితరులు పాల్గొన్నారు.