కోలా శ్రీను కుటుంబానికి జనసేన ఆర్థిక సాయం

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ పంచాయతీ గొల్లపేట గ్రామంలో అక్టోబరు నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కాలు కోల్పోయిన కోలా శ్రీను కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు తుంది. విషయం తెలుసుకున్న జనసేన మండల కార్యవర్గం ఆదివారం ఉదయం శ్రీను కుటుంబానికి 20,000 రూపాయలు సాయం అందించి, వారికి అన్ని విధాలుగా జనసేన పార్టీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, స్మార్ట్ రమేష్, బలభద్రుని జానకీరామ్, అప్పలనాయుడు, మాదేటి ఈశ్వర్రావు, లెంక సురేష్, దుక్క అప్పలరాజు, లంకలపల్లి యోగి, నరేంద్ర, అల్లాడ జగదీష్, బోనెల నర్సింగరావు, సూర్యప్రకాష్, వాళ్లె సంతోష్, చందర్రావు తదితరులు పాల్గొన్నారు.