క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన చిల్లపల్లి

మంగళగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలో ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాస రావు శనివారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తంగా గత సంవత్సరం 2 వేలు పైచిలుకు సభ్యత్వాలు చేశారని, ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరగాలని ఆయన కోరారు. సభ్యత్వం క్రియాశీల కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా ఉంటుందని, కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉండేలా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వంను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కావున మంగళగిరి నియోజకవర్గంలోని పార్టీ వాలంటీర్లు సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జెఎస్సార్), చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్ర, గుంటూరు జిల్లా కార్యదర్శి రావిరమా, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలంటరీలు నందం మోహన్ రావు, జొన్నాదుల పవన్ కుమార్, పోకల నరేంద్ర, లాల్ చంద్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, చిల్లపల్లి యూత్ సభ్యులు గోపి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.