ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై జనసేన వినూత్న నిరసన

🔸చివరిరోజైన, ఆదివారం భారీ జనసైనికులతో వినూత్న నిరసన
🔸నిద్రపోయిన ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గారూలు లేవాలని కూరుపాం నియోజకవర్గ జనసేన నాయుకులు జనసైనికులు పిలుపునిచ్చారు.

మన్యం పార్వతీపురం జిల్లా, కూరపాం నియోజకవర్గం పేదమేరింగి జంక్షన్ లో ఆదివారం జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ పాల్గొన్నారు. డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా రోడ్లపై ఉన్న పాడైపోయిన గుంతలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రతీ జనసైనికులు ఈ నెల 15,16,17 తేదీల్లో #ఘూదంఒర్నింగ్ఛంశిర్ అని పోస్ట్లు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో చివరిరోజైన ఆదివారం జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రోడ్లపై గుంతలు పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని, ఇకనైనా నిద్దురపోయినా ముఖ్యమంత్రి, రాష్ట్రంలో శాసనసభ్యులు మేల్కొని ప్రజలపక్షాన ఉండి న్యాయం చేయాలని, లేదంటే త్వరలో రోబోయే ప్రభుత్వం జనసేన అని, రోడ్లు గుంతలు పూడ్చడంతో పాటు, ప్రజలకు గొప్ప పాలన అందించే బాధ్యత జనసేన తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రజలుకి మంచి పరిపాలన రావాలి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కచ్చితంగా అవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకోరుకుంటున్నారని జనసేన జానీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కండ్రిక మల్లేష్, నేరేడుపల్లి వంశీ, వాన ఉపేంద్ర, గారా గౌరీ శంకర్, కిల్లాడ ఆనంత్, పెంట గౌరీశంకర్, శివ, కూరపాం నియోజకవర్గ జనసేన నాయుకులు జనసైనికులు పాల్గొన్నారు.