రైతు ఆత్మహత్యలు లేని సమాజ స్థాపనే జనసేనాని ధ్యేయం: నెరేళ్ల సురేష్

  • గుంటూరు జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

గుంటూరు: అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు సమాజానికి శ్రేయస్కరం కాదని, రైతు ఆత్మహత్యలు లేని సమాజ స్థాపనే ద్యేయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు శుక్రవారం పొత్తూరు, బుడంపాడు గ్రామాల్లోని రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులను, పార్టీ నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమానికి 26వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు నాగం అంకమ్మరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు రైతులు గురించి మాట్లాడటమే కానీ వారిని ఆదుకోవటంలోనూ, మేమున్నాం అన్న భరోసా ఇవ్వటంలోనూ విఫలమవుతూనే ఉన్నాయని విమర్శించారు. విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు ఎన్నో విషమ పరిస్థితులను ఎదురుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో అందని ఎరువులు, నకిలీ పురుగు మందులతో ఒకవైపు ప్రకృతి విపత్తులతో ఒకవైపు నిత్యం రైతు ఒక యుద్ధమే చేయాల్సి వస్తు0దన్నారు. ఇంతా చేసి పంట చేతికొస్తే సరైన ధర రాక ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి త్రిశంఖుస్వర్గంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అని పార్టీలు రైతుల్ని సైతం ఓటు బ్యాంకుగా చుస్తే రైతుల్ని అన్నదాతగా గౌరవిస్తూ వారికి కష్టాల్లో అండగా నిలుస్తుంది ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే అన్నారు. కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, లక్ష్మీ దుర్గలు మాట్లాడుతూ రైతు లేనిదే మనుషులకు జీవం, జీవనం లేదని అలాంటి రైతన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. గత మూడన్నరేళ్లుగా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను తన సొంత కష్టార్జితంతో ఆదుకున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి మనమందరం వెన్నుదన్నుగా నిలవాలని వారు కోరారు. తొలుత మిర్చి, పత్తి, ఆకుకూరల తోటలను పార్టీ నేతలు పరిశీలించారు. అనంతరం ఆదర్శ రైతులను నాగం అంకమ్మరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకా రాజు, స్థానిక నేతలు గరికిపాటి చెన్న కేశవులు, బండారు రవీంద్ర, చిమట నాగరాజు, పాలమూరు కోటి, జానకి రామయ్య, నాగేంద్ర సింగ్, పాటి వెంకటేశ్వర్లు, బాషా, జంజనం శివకుమార్, ఉదయ్, నవీన్, గడ్డం రోశయ్య, షర్ఫుద్దీన్, పులిగడ్డ గోపి, ఆంజనేయులు, భార్గవ్, శానం రమేష్, అంజి, గడ అరుణ, ఆషా, కవిత తదితరులు పాల్గొన్నారు.