అమలాపురం జనసేన ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలు

  • రైతు భాందవుడు పవన్ కళ్యాణ్

అమలాపురం, జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరంచుకుని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అమలాపురం నియోజకవర్గంలో రైతులతో మమేకమై ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నాయకులు అమలాపురం పార్లమెంట్ నియోజక వర్గం ఇంచార్జి డి.యం.ఆర్ శేఖర్ విచ్చేసారు. కార్యక్రమంలో బాగంగా అమలాపురం నియోజక వర్గం, అల్లవరం మండలం, డి.రావులపాలెం గ్రామంలో రైతులతో సమీక్షలు నిర్వహించి వారి సమస్యలు తెలుసు కున్నారు. అనంతరం ఉప్పలగుప్తం మండలం, వాడపర్రు గ్రామంలో వరి చేలను సందర్శించి, ఈ ప్రభుత్వం రైతుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యంపై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. అమలాపురం రూరల్ మండలం జనుపల్లి, నల్లమిల్లి గ్రామాలలో కల్లాల వద్ద రైతులను కలిశారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలనలో రైతులు తమ బాధలు జనసేన నాయకులకు విన్న వించారు.. ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు సైతం అనేక ఆంక్షలు పెట్టి సమయానికి ధాన్యాన్ని అమ్ముకొలేని పరిస్థితి తీసుకు వచ్చిందని, దీని వల్ల తదుపరి పంటకు పెట్టుబడులు లేక అప్పులు పాలు కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ఇస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆయా కుటుంబాల్లో ఎంతో భరోసా కల్పిస్తుందని ఈ సంధర్భంగా ఆయనకు రైతులు కృతజ్ఞతలు తెలియచేసారు. ఆదర్శ రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి వారిని సత్కరించారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్ర యొక్క వివరాలను ప్రజలకు తెలిసేలా స్థానిక గడియార స్తంభం వద్ద ప్రచార వాహనాలను డి.యం.ఆర్ శేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యాళ్ళనాగ సతీష్, కంచిపల్లి అబ్బులు, ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వర రావు, ఉండ్రు భగవాన్ దాస్, మండల నాయకులు లింగొలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, పోలిశెట్టి బాబులు, ఆర్.డి.యస్.ప్రసాద్, నాగ మానస, బట్టు పండు, తిక్కా శేషుబాబు, వాకపల్లి వేంకటేశ్వర రావు, కొల్లా విప్లవం, చాట్ల మంగతాయారు, కడియం సందీప్, డి యస్ యన్ కుమార్, నల్లా వేంకటేశ్వర రావు, సత్తి చిన్న, పిల్లా రవి, మండేల, వీరమహిళలు కరాటపు వాణి, వానపల్లి దేవి, బొరుసు సూర్యకుమారి, కంకిపాటి గోపి, పోలిశెట్టి మహేష్, పప్పుల నానాజీ, యాళ్ళ బిందాస్, జనసైనికులు మరియు నాయకులు పాల్గొన్నారు.