యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: దారం అనిత

మదనపల్లి: యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత కోరారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. జనవరి 12వ తేదీన యువశక్తి కార్యక్రమాన్ని జనసేన ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామని ప్రకటించిన వెంటనే బ్రిటీష్ కాలం నాటి జీవో వన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరియు జగన్మోహన్ రెడ్డి తను పాదయాత్ర సమయంలో ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్లు విడుదల చేయలేదు దీని పర్యవసానంగా నిరుద్యోగ యువత తప్పుదోవ పట్టిస్తున్నది ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షలు ఉద్యోగాలు ఉన్నా.. వాటిని అర్హులైన యువతకు అవకాశాన్ని కల్పించకపోగా, నియంత పాలన కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలే ఉండకూడదు, తిరగకూడదు అన్న నెపంతో పనికిమాలిన అక్కరకు రాని జీవోలను మరియు అవసరం లేని సెక్షన్లు రాష్ట్రంలో అమలులోనికి తెస్తూ ఇటు ప్రజలను, ప్రతిపక్షాలను ఇబ్బంది పాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తూ, వారిని మానసికంగా, కుటుంబ పరంగా లేదంటే వారి మీద లేనిపోని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. దీనిని యావత్ రాష్ట్ర ప్రజలు గమనించాలి శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జనవరి 12వ తేదీన జరిగే యువశక్తి కార్యక్రమం రాష్ట్రంలో యావత్ యువతీ యువకులు పాల్గొని తమ యొక్క అభిప్రాయాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎదుట తెలియజేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ యువశక్తి సభను విజయవంతం చేయాల్సిందిగా దారం అనిత ప్రతి ఒక్కరిని కోరారు.