యాదమరి ప్రధాన రహదారి అద్వాన్న పరిస్థితులపై జనసేన వినతిపత్రం

పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం పోలీస్ స్టేషన్ నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ఉన్న రోడ్లు బాగు చేసేంతవరకూ వివిధ మార్గాల్లో ఈ సమస్యను పూతలపట్టు జనసేన నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నాలలో భాగంగా ఎంపీడీవోని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సమస్యపై ఎంపీడీఓ స్పందిస్తూ త్వరలో సమస్యలను పై అధికారులకు తెలిపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జనసేన నాయకులు మీడియా సభ్యులతో మాట్లాడుతూ.. సమస్యలపై స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు, లేని యెడల పరిష్కరించే వరకూ నిరాహారదీక్షకు సైతం సిద్ధం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కుమార్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామ్మూర్తి, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు, జనసేన పార్టీ యాదమరి మండలం ప్రధాన కార్యదర్శి వేముల పవన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నానబాల లోకేష్, వెంకటేష్, ఎం వెంకటేష్, ప్రభాకర్ మరియు జనసైనికులు వంశీ, కిరణ్, లోకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.