ప్రత్తిపాడులో జనసేన పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక

ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ పాల్గొనడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా దీపికా శ్రీధర్ వేదికపై మాట్లాడుతూ జనసేన అనేది కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి కాకుండా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకు సంబంధించిందని, కులమతాలకు అతీతంగా జనసైనికుల కుటుంబాలను కలుపుతూ ఏర్పాటు చేసిన ఈ సమారాధన కార్యక్రమమే దీనికి నిదర్శనం, ఇలాంటి ఆలోచన మంచిదని అన్ని కులాల వారు అన్ని మతాలవారు కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ పాలుపంచుకోవడం చాలా సంతోషకరమైన విషయమని డాక్టర్ శ్రీధర్, మేడిశెట్టి బాబిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.