జనసేనాని తో జనసైనికులు

యువతే జనసేన ప్రధాన బలంగా జనసేనాని పవన్ కల్యాణ్ చెప్తూ ఉంటారు. సామాన్యులు, యువతకు పెద్దపీట వేస్తేనే రాజకీయాల్లో మార్పు తీసుకురావడం సాధ్యమని నమ్మే ఏకైక నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు యువతకు సీట్లు ఇచ్చి ప్రోత్సహించినది జనసెనే.
యువతకు ప్రాధాన్యం ఇస్తామని అన్ని పార్టీలు మాటల్లో చెబితే … జనసేన మాత్రమే చేతల్లో చేసి చూపించింది.

ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక పోవడం. రాజకీయ పార్టీలపై విశ్వాసం లేకపోవడం, రాజకీయ వ్యవస్థకి దూరంగా ఉండడం మాకు సంబంధించిన విషయం కాదని భావించడం. ఓటింగ్ లో పాల్గొనక పోవడం. ఎన్నికలకు దూరంగా ఉండడం చేస్తోంది నేటి యువత.

స్వాతంత్రోద్యమంలో ఉత్తుంగ తరంగాలై యువత పాల్గొంది. ఆంగ్లేయుల గుండెల్లో నిదురించిన అల్లూరి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన భగత్ సింగ్ వంటి ఎందరో యువత పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడారు. ప్రాణాలు కోల్పోయారు. నేటి యువతలో ఆనాటి స్ఫూర్తి కొరవడింది. రాజకీయాలంటేనే అంటరానివిగా చూస్తున్న వారి ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వస్తోంది.

చరిత్రలో యువత, విద్యార్థులు అనేక అద్భుతాలు సృష్టించారు. పాత సమాజాన్ని వెనక్కి తోసేసి కొత్త ఆలోచనలను, జీవన విధానాలను ముందుకు తీసుకొచ్చారు. చారిత్రక ప్రగతిలో యువత క్రియాశీల ప్రాత పోషిస్తుంది. సాహసం, కొత్త భావాలపట్ల అనురక్తి, క్రియాశీలత యువత సొంతం. అందువల్లే సమాజంలో కీలకమైన మార్పులు యువతం తీసుకొని వస్తుంది. రాజకీయ సామాజిక కార్యకలాపాల్లో యువత పాత్ర ఎంత పెరిగితే ఆ సమాజం అంత చైతన్యవంతంగా ముందకు వెళుతుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. యువత రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉంటే కచ్చితంగా మిగతా సమాజంపై ఆ ప్రభావం పడుతుంది!!

ఒక స్పష్ట మైన లక్షంతో ఆవిర్భవించిన జనసేన క్షేత్రస్థాయి నుంచి మార్పునకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ జనాన్ని తీవ్రంగానే ప్రభావితం చేసింది యువత, మహిళలు ఓట్లను తీవ్రంగా ఆకర్షించింది. గ్రామీణ స్థాయిలో తన లక్ష్యాన్ని సాధించడం కోసం జనసేన పార్టీ యువతనే ప్రధాన అస్త్రంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్.

సరికొత్త ఉత్సాహంతో, ప్రజా సమస్యలు తీర్చటానికి జనసేన తో కలిసి వచ్చే యువత ని ఎంపిక చేసి ఎన్నికల బరిలోకి దింపాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయ జవాబుదారీతనం రావాలి అంటే యువత రాజకీయాల్లో నిర్మాణాత్మక భాద్యత వహించాలి. అలా ప్రశ్నించే దమ్మున్న యువతే జనసేనకు జనసైనికుల గా మారాలి, అలాంటి నిప్పు కణాలే రావాలి. మీలో ఆ ధైర్యం, ఆ సత్తా, ఆ తెగువ, ఆ పొగరు ఉంటే కదలండి భయాన్ని భయపెట్టు.. ముందుకు సాగాలి అని పవన్ కళ్యాణ్ యువత గురించి చెప్పే మాటలు.

2014లో జనసేన పార్టీ స్థాపించే సమయంలో ఎన్ని సీట్లు వస్తాయి అన్న ఆలోచన జనసేనానీ చేయలేదు. ఎక్కడో ఒక చోట మార్పు రావాలి అని మాత్రమే ఆలోచనతో రాజకీయం చేస్తుంది. కొన్ని లక్షలమంది వెంట వచ్చే యువత తోడుతో, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళుతూ , కొత్త ఆలోచనలతో నిబద్ధతతో కూడిన రాజకీయం
చేసి మార్పు తీసుకురావడంలో జనసేన విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. స్థానిక సమస్యల పైన స్థానికంగా వేళ్లూనుకుపోయిన ఇబ్బందులు పైన దృష్టి పెడుతూ మార్పు కొరకు రాజకీయం చేయటంలో జనసేన విజయం సాధించింది.

కొత్త తరంతో రాజకీయాల్లో కి ముందుకు వచ్చే యువత కు పవన్ కళ్యాణ్ తప్ప వేరే ఏమి తెలియదు. పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా చేసే యువత దోరణి లో మార్పు రావాలి. యువత లో బలమైన సామాజిక మార్పు తీసుకురావాలి. యువత ముఖ్యంగా జనసేనానిని రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడాలి. అప్పుడు మాత్రమే జనసేనాని వెంట వచ్చే యువత తో బలమైన రాజకీయం చేసి, గొప్ప మార్పుతీసుకురాగలరు. తన సినిమాలతో యువత గుండెలను కొల్ల గొట్టిన పవన్ కళ్యణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన డైన శైలితో యువతను మురిపిస్తున్న నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్.

యువత గళం ఎత్తుతోంది మునెప్పెన్నడూ లేనివిధంగా రాజకీయాల్లో నవశకంమొదలైంది!నాయకులపనితీరును,నిశితంగా గమనిస్తూ తూర్పారబడుతూ
ప్రజస్వామ్యాన్నీ కాపాడేసైనికుల్లా!యువతలో మొదలైన ఈమార్పు ప్రజల్లోకూడా మొదలైతే ప్రజస్వామ్య సమాజానికి పండగే!విజయమే శ్వాసగా
సాగిపోండి జనసైనికుల్లారా!