మన ఊరిలో జనవాణి.. తిప్పలవలస గ్రామంలో లోకం మాధవి పర్యటన

జనసేన పార్టీ బలోపేతం మరియు ప్రజా సమస్యలపై పోరాటానికై నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రారంభించిన మన ఊరిలో జనవాణి కార్యక్రమంలో భాగంగా పూసపాటిరేగ మండలం, తిప్పలవలస గ్రామ పంచాయతీలో లోకం మాధవి పర్యటించడం జరిగింది. తిప్పలవలసలో పర్యటిస్తున్న మాధవి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూసి బావోద్వేగానికి గురయ్యారు. తిప్పలవలస ప్రజలు ఎక్కువ మంది మత్స్యకారులు కావటం గమనార్హం. ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు వారికి జట్టి నిర్మాణం చేపట్టాలి అని, దాని వలన వారి ప్రాంతం మరియు వారు ఎంతో అభివృద్ధి చెందుతారు అని లేకపోతే ఆ ప్రాంతం నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంటుందని ముత్స్యకార యువకులు వాపోయారు, ఆ ప్రాంతంలో వీధి కులాయిల సమస్య తమని వేదిస్తుంది, దాని వలన తమకి నీటి కొరత సమస్య ఉంది అని పేర్కొన్నారు. ఇంటికి కరెంటు కోత సమస్య 3 రోజులకి ఒకసారి ఉంటుందని, కొత్త కరెంటు మీటర్లు వచ్చాక తమకి
కరెంటు బిల్లులు మునుపటికంటే ఎక్కువ రుసుము చెల్లించాల్సి వస్తుంది అని పేర్కొన్నారు, గ్రామంలో పారిశుధ్య సమస్య ఎంతో అద్వానంగా తయారు అయిందని, తమ మురిగి నీరు మళ్ళీ తామే తిరిగి శుభ్రం చేస్కునే దుస్థితి వచ్చిందని, అదే డ్రైనేజీ లు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, డ్రైనేజీలకి బిల్లులు మంజూరు అయినా పంచాయతీ వారు రేపు మాపు అని పబ్బం గడుపుతున్నారు అని మహిళలు ఆవేదన చెందారు, బడిలో చదివే చిన్న పిల్లలు మాధవితో మాట్లాడుతూ.. తమ మధ్యాహ్న భోజనం నాణ్యమైనదిగా ఉండటంలేదని, అసలు ఆ భోజనాన్ని తినలేకపోతున్నామని పరువు మాధవి దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ తాను ఏ వీధి తిరిగినా విద్యుత్తు దీపాలు లేవు అని, గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ తమ వర్గం వారికే ఆన్ని పధకాలు అందేలా వివక్ష చూపిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇవాళ తిప్పలవలస లోని ప్రజలు సమస్యలకి కారణం అయింది అని పేర్కొన్నారు,
తిప్పలవలసలో పట్టిపీడిస్తున్న మరో సమస్య నీటి కొరత మాధవి మాట్లాడుతూ వారికి త్వరలోనే ఒక బోర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానితో ఆ గ్రామ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా ఉన్న ప్రభుత్వాలు తమకి ఏమీ చేయలేదని, మీరు వచ్చి ఈ మాట అనడం తమ గ్రామంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆ గ్రామ ప్రజానీకం తెలియజేశారు. ఊరిలో ఉన్న ఈ సమస్యల పట్ల జనసేన పోరాడుతుంది అని మాధవి భరోసా కల్పించారు.