జవహర్ లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవ కార్యక్రమం

నందికొట్కూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్లమల్ల రవికుమార్, బోరెల్లి వెంకటేష్ తదితరులు రావడం జరిగింది. నల్లమల రవికుమార్ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర సమర పోరాటంలో ముఖ్య పాత్ర వహించారు. మన దేశ మొదటి ప్రధానమంత్రి గా పనిచేశారు. జవహర్ లాల్ నెహ్రూ గారు పార్లమెంటరీ ప్రభుత్వాన్ని స్థాపించారు. విదేశీ వ్యవహారాల్లో తటస్థ విధానాలకు ప్రసిద్ధి చెందారు అని తెలియజేయడం జరిగింది.