అమలాపురం జనసేనలో చేరిక

డా.బి.ఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం గ్రామంలో చిక్కం సూర్యమోహన్ ప్రోత్సాహంతో వైసిపి, టిడిపి పార్టీలకు చెందిన పలువురు దళిత నాయకులు, శెట్టిబలిజ నాయకులు ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి రాజబాబు సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మీ అందరికీ పార్టీ అండగా ఉంటుందని, దైర్యంగా పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ ఉత్సాహం చూస్తుంటే త్వరలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తద్యమని, తద్వారా అంబేధ్కర్ ఆశయ సాధన సాధ్యమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో చిక్కం సుధా సూర్యమోహన్ దంపతులు, రాష్ర్ట కార్యక్రమాల కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కార్యదర్శి చిక్కాల సతీష్, ఎంపీటీసి తాళ్ళ రవి, సీనియర్ నాయకులు సూదా చిన్నా, ఆకుల బుజ్జి, ఆకుల సూర్యనారాయణమూర్తి, పిండి రాజా, గండి స్వామి, ముత్తాబత్తుల శ్రీను, లంకే వెంకట్రావు, పొనకల ప్రకాష్, గొర్తి పవన్, పినిశెట్టి సురేష్, వరసాల రమణ, అయితాబత్తుల భాస్కర్, నిమ్మకాయల మను, సలాది కన్నా, చీకట్ల రాజా, చీకట్ల సాయి తదితరులు పాల్గొన్నారు.