వైకాపా నుంచి జనసేన పార్టీలోకి చేరికలు

  • జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత
  • భవిష్యత్ జనసేనదే దూరదృష్టి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే నాయకులు పవన్ కళ్యాణ్

అనంతపురం అర్బన్: వైకాపా పార్టీ నుంచి అనంతపురం అర్బన్ నియోజక వర్గానికి చెందిన 5,12,48 డివిజన్ లకి చెందిన దాదాపు 20కుటుంబాలు మంగళవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవాస్తూర్తి, పోరాట పటిమకు ఆకర్షితులై జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. వీరికి ఆమె పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైకాపా పాలనవల్ల ప్రజలు విసిగి పోయి ఉన్నారని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశా నిస్పృహలతో ఉన్నారని భవిష్యత్తు జనసేన పార్టీదే అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రజలకు సుపరిపాలన అందిస్తామని అన్నారు. పార్టీలోకి చేరిన వారు వరలక్ష్మి ప్రముఖ వ్యాపార వేత్త హరికృష్ణ, సంజయ్, లలితమ్మ, సురేష్, బిబియా, మాబ్జా, ఫర్జానా, రుక్సానా, సురేఖ, హేమలత, శివయ్య, అనిత, కృష్ణ, అక్షయ, వెంకటేష్, వలి రహంతుల్లా, మహబూబ్ భాషా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, నాయకులు ప్రసాద్, వీరమహిళలు శైలజ, యమున, గాయత్రి తదితరులు పాల్గొనడం జరిగింది.