జనసేన పార్టీలో యువత చేరికలు

జగిత్యాల నియోజకవర్గం: జగిత్యాలలోని జగిత్యాల పట్టణం మరియు రాయికల్ మండల పరిది గ్రామాలకు చెందిన యువత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు, నచ్చి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ బెక్కం జనార్దన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ ఇంచార్జి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బెక్కం జనార్దన్ మాట్లాడుతూ యువత రాజకీయలోకి రావాలని యువతకు జనసేన పార్టీ పెద్దపీట వేస్తున్నదని, అందరూ కలిసి కట్టుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. నిజాయితీగా పని చేసే ప్రతి ఒక్కరిరు పార్టీలో చేరవచ్చని పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుందని అన్నారు. అందరం కలిసి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తాలని కోరారు. యువత పార్టీ లోకి చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లి రాము, పట్టణ అధ్యక్షులు చింత సుదీర్, మండల ఉపాధ్యక్షులు బొల్లి లక్ష్మణ్ మరియు జనసైనికులు వినయ్, పవన్, ఈశ్వర్, రాజు, లింగయ్య, ఉమేష్ తదిరతులు పాల్గొన్నారు.