ఎక్లాస్‌పూర్ గ్రామ యువత జనసేన పార్టీలో చేరిక

కరీంనగర్: అంతర్గాం మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామంలో నరేష్ ఆధ్వర్యంలో జరిగిన జనసేన ఆత్మీయ సమ్మేళ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల మధు సమీక్షంలో ఎక్లాస్‌పూర్ గ్రామ యువకులు 50 మంది జనసేన పార్టీలో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రావుల మధు మాట్లాడుతూ గతంలో కొండగట్టు యత్రలో అధ్యకులు పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ గారు తెలిపిన విధంగా తెలంగాణ రాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 34 స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, రామగుండం నియోజకవర్గంలో కూడా పోటీలో ఉంటుందని తెలియజేశారు. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు మంథని శ్రావణ్, రామగుండం మండల నాయకులు మోతే రవికాంత్, తుంగపల్లి కుమారు, మండల కార్యదర్శి మంథని మధు, నరేష్, దేవవరం, ప్రవీణ్, సాయి నిఖిల్, రఘు, సాయి, వెంకటేష్, అఖిల్, రాకేష్, రాజు, నిఖిల్ తేజ్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.