గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

పాయకరావుపేట నియోజకవర్గం, పాయకరావుపేట మండలం నుంచి వెంకటనగరం గ్రామానికి చెందిన టీడీపీ వార్డు మెంబెర్లు జగన్, శ్రీనుతో పాటుగా 30 మంది మంగళవారం జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి గెడ్డం బుజ్జి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుజ్జి వారితో మాట్లాడుతూ మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.