వంచంగి గ్రామంలో జనసేన పార్టీలో చేరికలు

రంపచోడవరం నియోజకవర్గం: రాజవొమ్మంగి మండలం, వంచంగి గ్రామంలో జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరగా జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల పక్షపాతి అని, గిరిజనులంటే మక్కువ అని అన్నారు. జనసేన పార్టీ విధివిధానాలను, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను వివరించారు. కార్యక్రమంలో రాజవొమ్మంగి జనసేన పార్టీ మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి, త్రిమూర్తులు, రంపచోడవరం నియోజకవర్గం నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, కొంతఒ శ్రీనివాసు, అడ్డతీగల మండల నాయకులు కుప్పాలా జయరాం, పొడుగు సాయి, బాబి, అప్పాజీ, గంగవరవం మండల అధ్యక్షులు కుంజం సిద్దు, రాజవొమ్మంగి యువజన అధ్యక్షులు కొచ్చా లోకేష్, మండల నాయకులు పోకల మల్లికాసులు, కొప్పాన శివ, పల్లి చిట్టి బాబు, జానకి దుర్గాప్రసాద్, మకిరెడ్డి దుర్గాప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.